దేశంలోని రైతులకు బిగ్ షాక్ తగిలింది. ఏటా రైతులకు పీఎం-కిసాన్ పథకం కింద ఆర్థిక సాయం కింద ఇస్తున్న రూ.6వేల మొత్తాన్ని పెంచే ఉద్దేశం లేదని కేంద్రం ప్రకటించింది. లోక్ సభలో సభ్యుడు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి అర్జున్ ముండా ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
ఎన్నికల ఏడాది నేపథ్యంలో పీఎం-కిసాన్ మొత్తాన్ని రూ. 8,000 నుంచి 12,000 వరకు కేంద్రం పెంచనున్నట్టు ప్రచారం జరిగింది. అయితే అలాంటి ప్రకటన ఏది లేకుండానే మంగళవారం పార్లమెంట్ లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తన ప్రసంగాన్ని ముగించారు. కాగా, గత ఏదు ఏళ్లుగా పీఎం-కిసాన్ పథకం కింద ఏటా రైతులకు రూ.6వేలు ఆర్థిక సాయం మోడీ సర్కార్ చేస్తోంది.