National Politics: అయోధ్యకు పొటెత్తిన భక్తులు.. రూ.3.17 కోట్ల విరాళాలు

National Politics: Devotees flocking to Ayodhya... donate Rs. 3.17 crores
National Politics: Devotees flocking to Ayodhya... donate Rs. 3.17 crores

నిన్న అయోధ్య రామమందిరానికి భక్తులు భారీగా పోటెత్తారు. బాల రాముడిని 2.5 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది. మరోవైపు తొలి రోజున భక్తులు రూ.3.17 కోట్ల విరాళాలు సమర్పించినట్లు వెల్లడించింది.

ప్రాణప్రతిష్ట తర్వాత ఆలయంలో 10 హుండీలను ఏర్పాటు చేశామని పేర్కొంది. కాగా, తొలిరోజు 5 లక్షల మందికిపైగా భక్తులు రామయ్యను దర్శించుకున్న సంగతి తెలిసిందే. అయితే భక్తులు ఎక్కువమంది వస్తుండడంతో రానున్న పది రోజులు పాటు విఐపి లు అయోధ్యకి రావద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రద్దీ ఎక్కువ ఉందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శన సమయాన్ని కూడా పొడిగించారు. రామ్ లల్లా దర్శనం చేసుకోవడానికి ఉదయం 7 నుండి రాత్రి 11 గంటల వరకు అవకాశాన్ని కల్పించారు.