ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ముందు ప్రపంచం మొత్తం ఓడిపోయినప్పటికీ భారత్ మాత్రం విజయం సాధించిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత్ కరోనాను జయించడంలో రాష్ట్రాల పాత్ర కూడా ఉందని ప్రశంసించారు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 20 సార్లు సమావేశమయ్యామని మోడీ గుర్తుకు చేశారు. రాష్ట్రపతి ధన్యవాద తీర్మాణం పై చర్చ సందర్భంగా తాజాగా రాజ్యసభలో ప్రధాని మాట్లాడారు.
దేశం అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల అభివృద్ధికి కావాల్సిన నిధులను ఇస్తున్నామని తెలిపారు ప్రధాని. ఫెడరలిజానికి ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుందని తెలిపారు. భారతదేశ గొప్పతనం ఢిల్లీలో కాదని, దేశంలో నా మారుమూల ప్రాంతాల్లో ఉందన్నారు. భారత్ అంటే ఒక్క ఢిల్లీనే కాదని, ముంబై, హైదరాబాద్, బెంగళూరు అంత భారతేనని పేర్కొన్నారు. అందుకే జీ20 సమావేశాలను దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర్వహించామని తెలిపారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదం కాదని.. ఇది మోడీ గ్యారెంటీ అన్నారు.