National Politics: ఈరోజే సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్‌

National Politics: First notification of general elections today
National Politics: First notification of general elections today

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. ఇక ఈ సమరంలో తొలి ఘట్టానికి ఇవాళ నాంది పడబోతోంది. లోక్సభ 2024 ఎన్నికలకు ఇవాళ తొలి విడత నోటిఫికేషన్ విడుదల కానుంది. తొలి విడతలో భాగంగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు ఈరోజు నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 27. 28వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 30వ తేదీలోగా ఉపసంహరణకు గడువు ఉంటుంది.

ఏప్రిల్‌ 19వ తేదీన ఈ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్‌ జరగనుంది. తొలి విడత ఎన్నికలు జరగనున్న వాటిలో తమిళనాడులోని 39, రాజస్థాన్‌లోని 12, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 8, మధ్యప్రదేశ్‌లోని 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, అస్సాంలలోని ఐదేసి, బిహార్‌లోని 4, పశ్చిమ బెంగాల్‌లోని 3, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయల్లో రెండేసి, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, జమ్మూ కశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిల్లో ఒక్కొక్కటి ఉన్నాయి.