“హను మాన్” కి ఓటిటిలో నెగిటివ్ రావడానికి ఇదే కారణం?

Is this the reason why “Hanu Maan” got negative in OTT?
Is this the reason why “Hanu Maan” got negative in OTT?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ మూవీ “హను మాన్” (Hanu Man Movie). మరి టాలీవుడ్ నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో మూవీ ఇది కాగా ఫస్ట్ అటెంప్ట్ లోనే ఈ మూవీ సెన్సేషనల్ వసూళ్లతో పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టింది.

అయితే ఈ మూవీ థియేటర్స్ లో ఇప్పటికీ స్ట్రాంగ్ బుకింగ్స్ కనబరుస్తుండగా దీనితో పాటుగా అంతా అవైటెడ్ గా ఎదురు చూస్తున్న ఓటిటి (Hanu Man OTT) రిలీజ్ కూడా జీ 5 లో కి వచ్చింది . అయితే అనూహ్యంగా ఓటిటిలో వచ్చాక ఈ మూవీ పై ఒకింత నెగిటివ్ కామెంట్స్ కూడా ఎక్కువ వచ్చాయి.

Is this the reason why “Hanu Maan” got negative in OTT?
Is this the reason why “Hanu Maan” got negative in OTT?

అయితే దీనికి వినిపిస్తున్న పలు కారణాల్లో మరో ప్రధాన కారణం ఒకటి ఉంది. ఈ మూవీ డెఫినెట్ గా బిగ్ స్క్రీన్స్ పై చూసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ అని ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఎప్పుడో చెప్పాడు. ఖచ్చితంగా హను మాన్ స్మాల్ స్క్రీన్ మూవీ కాదని అందుకే ఓటిటి రిలీజ్ కూడా త్వరగా రాదనీ కన్ఫర్మ్ చేసాడు.

దీనితో థియేట్రికల్ గా ఆడియెన్స్ కు సూపర్బ్ ఎక్స్ పీరియెన్స్ ని అందించిన ఈ మూవీ ఈ కారణం చేత ఇప్పుడు వరకు థియేటర్స్ లో చూడకుండా డైరెక్ట్ ఓటిటిలో చూసినవారికి నిరాశ కలిగించవచ్చు. ఇక ఇవి వస్తున్నప్పటికీ ఓటిటిలో మాత్రం హను మాన్ రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ తో ఇప్పుడు దూసుకొని పోతుంది .