National Politics: మొదటిసారిగా UPI రికార్డు స్థాయిలో లావాదేవీలు

National Politics: For the first time UPI records record transactions
National Politics: For the first time UPI records record transactions

దేశంలో యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్ సర్వీసెస్) లావాదేవీలు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24లో రికార్డు స్థాయిలో గణనీయంగా పెరిగాయి. సంఖ్యా పరంగా 57 శాతం, విలువ పరంగా 44 శాతం పెరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

నెలవారీగా కూడా ఈ ఏడాది మార్చిలో లావాదేవీలు 55 శాతం పెరిగి 13.44 బిలియన్లకు చేరాయి. విలువ పరంగా 40 శాతం వృద్ధితో రూ. 19.78 లక్షల కోట్లకు పెరిగాయి. 2022-23లో 84 బిలియన్ల UPI లావాదేవీలు నమోదయ్యాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలు 100 బిలియన్లు దాటి 131 బిలియన్లకు చేరుకోవడం ఇదే తొలిసారి.2023 సంవత్సరానికి గాను రూ. 139.1 లక్షల కోట్ల నుంచి రూ. 199.89 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఈ సంవత్సరం జనవరి నెలలో యూనిఫైడ్ పేమెంట్ సర్వీస్ లావాదేవీలు 12.20 బిలియన్లు, విలువ పరంగా రూ. 18.41 లక్షల కోట్లుగా నమోదవగా, ఫిబ్రవరి నెలలో 12.10 బిలియన్ల లావాదేవీలు, విలువలో రూ. 18.28 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. మార్చి నెలలో ఫాస్టాగ్ లావాదేవీలు సంఖ్యా పరంగా 11 శాతం పెరిగి 33.9 కోట్లు, విలువలో 17 శాతం వృద్ధితో రూ. 5,939 కోట్లుగా నమోదయ్యాయి.