కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. అతి త్వరలోనే డీఏ ని పెంచునున్నారు. ఈ కొత్త ఏడాదికి తొలి ఆరు నెలలు అంటే జనవరి నుండి 6 నెలలకి సంబంధించిన డిఏ, డిఆర్ ని పెంచాలని చూస్తోంది ప్రభుత్వం. దీనితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు పెరుగుతాయి. వచ్చే ఆరు నెలల కాలానికి నాలుగు శాతం మేర డీఏ పెంపు ఉంటుందని తెలుస్తోంది.
అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన 2024 మార్చి నెలలో ఉంటుందని తెలుస్తోంది. మార్చి నెల లో డిఏ పెంపు నాలుగు శాతం మీద పెంచబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో డిఏ 50 శాతానికి చేరుకుంటుంది. ఇది వరకు అక్టోబర్ 2023 డిఏ నాలుగు శాతం మీద పెంచారు సాధారణంగా ప్రతీ ఏటా కూడా మార్చి, సెప్టెంబర్ నెల లో ఈ ప్రకటనలు ఉంటాయి కరువు బత్యం పై సమీక్ష జనవరి 1 , జూలై 1న మొదలవుతుంది.