National Politics: రైతులకు శుభవార్త.. వారి ఖాతాల్లోకి కిసాన్‌ సమ్మాన్‌ నిధులు

National Politics: Good news for farmers.. Kisan Samman funds in their accounts
National Politics: Good news for farmers.. Kisan Samman funds in their accounts

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల ఖాతాల్లో కిసాన్‌ సమ్మాన్‌ డబ్బులను బుధవారం జమ చేయనున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళ, బుధవారారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్రాల్లో పర్యటించనున్న నేపథ్యంలో రూ.21 వేల కోట్ల కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్‌లో జరిగే కార్యక్రమంలో 16వ విడత కిసాన్‌ సమ్మాన్‌ నిధి సహాయాన్ని విడుదల చేయనున్నారు.

ఈ పథకం కింద 11 మందికిపైగా రైతులకు రూ.3లక్షలకోట్లకుపైగా కేంద్రం సాయాన్ని అందించింది. దాదాపు రూ.3,800 కోట్ల విలువైన ‘నమో షేత్కారీ మహాసమ్మన్ నిధి’ రెండో, మూడో విడత నిధులను సైతం ప్రధాని పంపిణీ చేయనున్నారు. మహారాష్ట్రవ్యాప్తంగా దాదాపు 88 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతులకు కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ సమ్మాన్‌ నిధిలో భాగంగా ఏడాదికి రూ.6వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 15 విడతల్లో నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది.