బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిగ్ షాక్ తగిలింది. జేపీ నడ్డా సతీమణి కారు చోరీకి గురైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణికి సంబంధించిన టయోటా ఫార్చూనర్ కారును కొందరు దొంగలు ఢిల్లీ నివాసం నుంచి ఎత్తుకెళ్లారు. ఈ నెల 19న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జేపీ నడ్డా సతీమణి కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణికి సంబంధించిన టయోటా ఫార్చూనర్ కారును తెలిసిన వాళ్లే చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.