భారతదేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలలో లభించే ప్రసాదాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాటిని భక్తులు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారు. పుణ్యక్షేత్రాల నుండి కొనుగోలు చేసినటువంటి లడ్డును తమవారికి పంచుతూ ఉంటారు. ఇందులో మొదటగా తిరుపతి లడ్డు గురించి చెప్పుకోవాలి .ఎందుకంటే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దాదాపు 1100 మంది పైగా ఈ లడ్డూలను వంటశాలలో తయారు చేస్తారు. ఈ ప్రసాదానికి ఉన్న రుచి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
అలాగే అన్నావరం సత్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రంలో లభించే ప్రసాదం ఎంతో ప్రత్యేకమైనది.
ఇక షిర్డీలో దూద్ పేడా ప్రసాదం ప్రత్యేకం. వారణాసిలోని అన్నపూర్ణ ఆలయంలో భోజనం, వైష్ణో దేవి డ్రై ఫ్రూట్స్, గురుద్వారాలో కడ ప్రసాదం, కృష్ణ దేవాలయాలలో మఖన్ మిశ్రీ వంటివి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో లభించే అటువంటి ప్రసాదాలలో కొన్ని. అయితే ప్రస్తుతం అయోధ్య పుణ్యక్షేత్రంలో లభించే ప్రసాదం ప్రత్యేకత గురించి కూడా చెప్పుకోవాలి.
అయోధ్యలో జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది.అయోధ్య రాముని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ప్రసాదంగా చక్కెర, యాలకుల మిశ్రమంతో తయారు చేసిన ‘ఇలాచీ దానా’ ఇవ్వనున్నారు.