లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఈ ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధిస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష కూటమికి సరైన నాయకుడు లేకపోవడం, అందులోని పార్టీలకు నష్టం చేకూరుస్తుందని తేల్చి చెప్పారు.
దేశవ్యాప్తంగా ఎన్డీఏకు 335 సీట్ల వరకు కచ్చితంగా వస్తాయని, బీహార్ లోనే 40 వరకు సీట్లు దక్కుతాయని జోస్యం చెప్పారు. ఇక 2025 బీహార్ ఎన్నికల్లో జేడీయుకి ఓటమి తప్పదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, జేడీయూ కూటమి ఏడాది కూడా నిలబడదని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత నితీశ్ కుమార్ బీజేపీకి బైబై చెప్తారని అన్నారు. ‘2025 అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ కూటమి కొనసాగదు. లోక్సభ ఎన్నికలు ముగిసిన ఆరు నెలల తర్వాత మార్పు జరుగుతుంది. ఈ విషయం రాసిస్తా’ అని తేల్చి చెప్పారు.