పటేల్ గూడలోని SR ఇన్ఫినిటీలో ప్రధాని బహిరంగ సభ జరగనుంది. సంగారెడ్డి వేదికగా 9021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ప్రధాని మోడీ చేయబోతున్నారు. సంగారెడ్డిలో 1409 కోట్లతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి ప్రధాని మోడీ అంకితం చెయ్యబోతున్నారు.
సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ దాకా 1298 కోట్లతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. మెదక్ జిల్లా లో 399 కోట్లతో చేపడుతున్న NH 765D మెదక్- ఎల్లారెడ్డి హైవే విస్తరణ, 500 కోట్లతో ఎల్లారెడ్డి- రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు 2 వేల మందితో పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేసారు.