National Politics: రాజ్యసభకు నామినేషన్ వేసిన సోనియా గాంధీ

National Politics: Sonia Gandhi nominated for Rajya Sabha
National Politics: Sonia Gandhi nominated for Rajya Sabha

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరికొద్ది రోజుల్లో తొలి సారిగా రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో ఆమె పోటీకి దిగారు. ఈ క్రమంలోనే సోనియా గాంధీ తాజాగా జైపుర్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. సోనియా వెంట ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ, ఇతర నేతలు ఉన్నారు. సోనియా గాంధీతో పాటు మరో మూడు స్థానాల అభ్యర్థుల జాబితాను విడుదల కాంగ్రెస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో రాజస్థాన్‌ నుంచి మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బిహార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్, అభిషేక్ మను సింఘ్వి, చంద్రకాంత్ హండేరే పేర్లను ప్రకటించింది.

మరోవైపు తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేయనున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ పేర్లు ప్రకటించనుంది. ఇప్పటికే ఒకస్థానానికి పార్టీ కోశాధికారి అజయ్‌ మాకెన్‌ పేరును దాదాపుగా ఖరారు చేసినట్టు సమాచారం. మరో స్థానంపై తీవ్ర కసరత్తు చేస్తున్న హైకమాండ్ ఇవాళ సాయంత్రం వరకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.