National Politics: పాకిస్తాన్ లో కన్నా నిరుద్యోగం భారత్ లోనే ఎక్కువ: రాహుల్ గాంధీ

National Politics: Unemployment is more in India than in Pakistan: Rahul Gandhi
National Politics: Unemployment is more in India than in Pakistan: Rahul Gandhi

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఇండియాలో నిరుద్యోగం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ కన్నా ఎక్కువగా ఉందని, భూటాన్ కన్నా వెనకబడి ఉన్నామని రాహుల్ గాంధీ తెలిపారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ…నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో చిన్న వ్యాపారాలన్నింటికీ తీవ్ర విఘాతం కలిగిందని ఆరోపించారు . పాకిస్తాన్‌తో పోలిస్తే ఇండియాలో రెండింతల నిరుద్యోగిత ఉందని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల కంటే పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యత ఇస్తోందని ,రైతుల రుణమాఫీని విస్మరిస్తూ, కొందరు పారిశ్రామికవేత్తలకు భారీ రుణమాఫీని ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.భారత్ జోడో న్యాయ యాత్ర శనివారం మధ్యాహ్నం మొరెనా జిల్లా మీదుగా మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఒక సర్వే ప్రకారం 2022-23 సంవత్సరానికి గాను పాకిస్తాన్ నిరుద్యోగిత రేటు 8.5 శాతం కాగా.. ఇండియా నిరుద్యోగిత రేటు 3.2 శాతంగా నమోదైంది.