National Politics: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి తీవ్రంగా గాయం

National Politics: West Bengal CM Mamata Banerjee is seriously injured
National Politics: West Bengal CM Mamata Banerjee is seriously injured

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా గాయపడ్డారు. నుదిటిపై గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఫొటోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆమె ఎలా గాయపడ్డారనేది తెలియాల్సి ఉంది.

కాగా, ఆమె తలపై తీవ్ర గాయం కారణంగా రక్తం వస్తున్నట్టు ఆ ఫోటోలో కనిపించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి మమతా తలకు గాయంతో ఆసుపత్రి బెడ్ పై పడుకొని ఉన్న ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.