National Politics: శ్రీరామనవమి స్పెషల్.. శ్రీ కృష్ణుడి గుడి నుంచి తొలిసారి ‘మఠడీ’..

National Politics: Sri Ram Navami Special.. First 'Mathadi' from Sri Krishna Temple..
National Politics: Sri Ram Navami Special.. First 'Mathadi' from Sri Krishna Temple..

అయోధ్య శ్రీ రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత జరగనున్న మొదటి శ్రీ రామనవమి వేడుకల కోసం రామజన్మభూమి ట్రస్టు రంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా రాజస్థాన్ నాథ్ద్వారాలోని శ్రీనాథ్‌జీ అనే ఓ పురాతనమైన శ్రీ కృష్ణుడి ఆలయం నుంచి తొలిసారి ‘మఠడీ’ అనే మహాప్రసాదాన్ని అయోధ్య రాముడికి పంపిస్తున్నారు. శ్రీనాథ్‌జీ ఆలయం నుంచి ఈ నైవేద్యంతో యాత్ర ఆదివారం రోజున ప్రారంభమైంది. థ్ద్వారా నుంచి ప్రారంభమైన మఠడీ మహాప్రసాదం యాత్ర భిల్వారా, జైపూర్, మథుర జాతిపుర, లఖ్నవూ మీదుగా ఏప్రిల్ 17 బుధవారం శ్రీ రామనవమి రోజున అయోధ్యకు చేరనుంది. లక్ష మఠడీల మహాప్రసాదాన్ని అయోధ్యకు చేరుకోనుంది.

మరఠీ ప్రసాదాన్ని బాలక్రాముడికి నివేదించిన తర్వాత గుడికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచనున్నారు. ఉదయ్పుర్ నాథ్ద్వారాలోని శ్రీ నాథ్జీ ఆలయంలో మాత్రమే మరఢీ ప్రసాదాన్ని తయారు చేస్తారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలు, గోధుమ పిండి, పంచదార పాకంతో తయారు చేస్తారు. ఈ ప్రసాదం త్వరగా పాడవ్వకుండా ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుందట.