National Updates: ఎన్నికల కోడ్.. రోజుకు సగటున రూ.100 కోట్లు స్వాధీనం..!

National Updates: Election code.. An average of Rs. 100 crores seized per day..!
National Updates: Election code.. An average of Rs. 100 crores seized per day..!

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో రూ.4,658 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందులో రూ.395.39 కోట్ల నగదు, రూ.489.31 కోట్ల విలువైన మద్యం, రూ.2,068.85 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.562.10 కోట్ల విలువైన లోహాలు, ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచిన రూ.1,142.49 కోట్ల విలువైన కానుకలు ఉన్నట్లు పేర్కొంది. ఇంత పెద్ద మొత్తంలో సొత్తు స్వాధీనం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని తెలిపింది.

మార్చి 1 నుంచి ఇప్పటివరకు రోజుకు సగటున రూ.100 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. రూ.778 కోట్లతో రాజస్థాన్‌ తొలి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ 12, తెలంగాణ 13 స్థానాల్లో ఉన్నాయి. 2019 ఎన్నికల కాలం మొత్తం కలిపి రూ.3,475 కోట్ల సొత్తు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 13 మధ్యకాలంలోనే గత ఎన్నికల కంటే 33.85% ఎక్కువ సొత్తు చేజిక్కించుకున్నట్లు ఈసీ అధికారులు వెల్లడించారు.