Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హీరో లేదా హీరోయిన్ సక్సెస్ రాగానే పారితోషికం అమాంతం పెంచేస్తారు అనే టాక్ ఉంది. అన్ని సినిమా పరిశ్రమల్లో కూడా సక్సెస్‌లు దక్కించుకున్న వారు వారి పారితోషికాన్ని పెంచేస్తారు. అయితే నాని మాత్రం తాను అందుకు విభిన్నం అని చెబుతున్నాడు. తాను ఎప్పుడు కూడా పారితోషికం పెంచలేదు అని, తన సక్సెస్‌లతో నిర్మాతలు స్వయంగా వారి ఇష్టం మేరకు పెంచుతూ వచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు. నాకు ఇంత పారితోషికం కావాలంటూ ఎప్పుడు డిమాండ్ చేయలేదని, తన గత సినిమా పారితోషికం చెబితే, పారితోషికాన్ని నిర్మాతలే డిసైడ్ చేస్తారు అంటూ నాని పేర్కొన్నాడు.
వరుసగా ఏడు సక్సెస్‌లను దక్కించుకున్న నాని నేడు ‘కృష్ణార్జున యుద్దం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంకు నాని ఏకంగా పది కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రెండు పాత్రలు అవ్వడం వల్ల నాని ఇంత మొత్తం డిమాండ్ చేశాడు అంటూ వస్తున్న వార్తలపై పై వివరణను నాని ఇచ్చాడు. నాని పారితోషికం విషయంలో సీరియస్‌గా ఉండడు అంటూ సినీ వర్గాల్లో కూడా టాక్ ఉంది. అయితే నానితో సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో నిర్మాతలు భారీ మొత్తాలను ఆయనకు ఆఫర్ చేస్తారు అనేది మాత్రం నిజం. అందుకే నాని ప్రమేయం లేకుండానే ఆయన సినిమాల పారితోషికాలు పెరుగుతూ పోతున్నాయి.