‘వసంత కాలం’ లో ఉన్న నయనతార

‘వసంత కాలం’ లో ఉన్న నయనతార

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తమిళ సినిమా ‘కోలైయుతీర్ కాలమ్’.. ‘బిల్లా 2’ ఫేమ్ చక్రి తోలేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో భూమిక ఇంపార్టెంట్ రోల్ చేసింది. థ్రిల్లర్ అంశాలతో తెరెక్కిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

‘కోలైయుతీర్ కాలమ్’ను ‘వసంత కాలం’ పేరుతో తెలుగులో డబ్ చేస్తున్నారు. భూమిక, ప్రతాప్‌ పోతన్, రోహిణి హట్టంగడ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. సస్పెన్స్, హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత దామెర వి.ఎస్‌.ఎన్‌. శ్రీనివాస్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు.

‘‘గతంలో ‘ఏకవీర, వేటాడు వెంటాడు’ వంటి చిత్రాలను తెలుగులో విడుదల చేశాం. ‘వసంత కాలం’ డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్‌లో మూవీ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం. తెలుగులోనూ ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత అన్నారు.