మేరీ ఇన్.. నిఖత్‌ అవుట్..

తెలంగాణ బాక్సర్‌కి అవకాశం లేకుండా చేసిన బీఎఫ్‌ఐ

ఆసియా ఒలింపిక్స్‌ క్వాలిఫయర్‌ పోటీలు వచ్చే ఫిబ్రవరి 2020 లో చైనాలో జరుగబోనున్నాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచిన విజేతల్ని ఈ ఈవెంట్‌కు బీఎఫ్‌ఐ ఎంపిక చేయనుంది.సెలక్షన్‌ ట్రయల్స్‌తో పని లేకుండానే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యాలు గెలిచిన మేరీ కోమ్‌,లవ్లీనా ని చైనా ఈవెంట్‌కు అర్హత సాదించారు. మేరీకోమ్‌ 51 కేజీలు,లవ్లీనా 69 కేజీలు కేటగిరీలో ఉన్నారు. 51 కేజీల కేటగిరీలో ఉన్న తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ బీఎఫ్‌ఐ-భారత బాక్సింగ్‌ సమాఖ్య చేతిలో నాకౌట్‌ అయ్యింది.

ఈ నిర్ణయంపై మేరీ సంతోషం వ్యక్తం చేస్తూ ”ఆనందంగా ఉందంటూ పతక విజేతనైనా నాకు నేరుగా ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌లో పాల్గొనే అవకాశం కలిపించిన భారత బాక్సింగ్‌ సమాఖ్యకి కృతజ్ఞతలు తెలిపింది. పతక విజేతలకు అవకాశం ఇవ్వగా మరోసారి తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు నిరాశ ఎదురై ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌కు అవకాశం లేకుండా ఉండాల్సి వచ్చింది.