నేడు ‘మహానటి’ పుట్టినరోజు

నేడు 'మహానటి' పుట్టినరోజు

‘మహానటి’తో జాతీయ అవార్డు గెలుచుకున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ పుట్టినరోజు నేడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో కీర్తీ సురేశ్‌ మెయిన్ లీడ్‌గా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌.. దిల్‌ రాజు సమర్పణలో, వర్త్ ఎ మోషన్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై సుధీర్‌ చంద్ర ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హిందీలో ‘హైదరాబాద్‌ బ్లూస్‌’, ‘రాక్‌ఫోర్డ్‌’, ‘ఇక్బాల్‌’ చిత్రాలతో పేరు తెచ్చుకున్న నగేశ్‌ కుకునూర్‌ దర్శకుడు. ఆయనకు తెలుగులో తొలి చిత్రమిది. ఆయన మాతృభాష తెలుగే. క్రీడా నేపథ్యంలో రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రధారులు. కీర్తీ సురేశ్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె లుక్‌ విడుదల చేశారు.

మెడలో తాయిత్తు, చేతికి మట్టి గాజులతో హాయిగా నవ్వుతూ ఉన్న కీర్తి లుక్‌ బాగుంది. షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ వచ్చే నెల 11 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. దీపావళికి ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యనున్నారు. సహ నిర్మాత: శ్రావ్య వర్మ, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: చిరంతన్‌ దాస్‌.