తెలుగు సినీ పరిశ్రమలో లక్ష్మీ చిత్రంతో పరిచయం అయ్యి, ఆ తర్వాత తమిళ సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మెల్ల మెల్లగా అక్కడ స్టార్‌డంను దక్కించుకున్న ముద్దుగుమ్మ నయనతార ఇప్పుడు తమిళ సినిమా పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగి పోయింది. ఒక్కో సినిమాకు మూడు నాలుగు కోట్ల పారితోషికం అందుకుంటున్న నయనతార తెలుగులో ప్రస్తుతం ‘సైరా’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం అయిన సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. రామ్ చరణ్ ఈ చిత్రం కోసం నయనతారను భారీ పారితోషికం ఇచ్చి మరీ తీసుకు వచ్చాడు. అయితే ఇప్పుడు నయనతార వల్ల చిత్ర యూనిట్ సభ్యులు చాలా టెన్షన్ పడుతున్నారట.
నయతార డేట్లు దొరకడమే చాలా గగణం అయ్యింది. ఆమె ఇచ్చిన డేట్లు వృదా చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పుడు ఆమె డేట్ల కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నాడు. తాజాగా నయనతార మూడు రోజుల డేట్లు ఇవ్వడం జరిగింది. ఆమూడు రోజుల్లోనే ఈ షెడ్యూల్‌కు సంబంధించిన ఆమె చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా నయన్‌కు సంబంధించిన సీన్స్ చిత్రీకరణను సురేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు. ఆమె ఆ మూడు రోజుల డేట్లు మిస్ అయితే మళ్లీ నెల రోజుల వరకు వచ్చే అవకాశం లేదట. దాంతో సైరా చిత్ర యూనిట్ సభ్యులు ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ ఆమెతో చిత్రీకరణ జరుపుతున్నారు. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న చిత్రంలో సైరా నరసింహారెడ్డి భార్యగా నయనతార కనిపించబోతుంది.