కాబోయేభ‌ర్త గురించి పెద‌వి విప్పిన న‌య‌న‌తార‌

Nayanthara Open About Her Husband

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

త‌న ప్రేమ గురించి మొద‌టిసారిగా పెద‌వివిప్పింది న‌య‌న‌తార‌..త‌మిళ ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివ‌న్, న‌య‌న‌తార ప్రేమించుకుంటున్నార‌ని, ఈ ఏడాది పెళ్లిపీటలు కూడా ఎక్క‌బోతున్నార‌ని, కొన్నాళ్ల‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇద్ద‌రూ క‌లిసి చెన్నైలో ఓ ఇల్లు కొన్నార‌ని, పెళ్లిచేసుకున్న‌త‌ర్వాత ఇద్ద‌రూ ఆ ఇంట్లోనే ఊంటార‌ని కూడా కోలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. అయితే వాళ్లిద్ద‌రూ ఎప్పుడూ ఈ విష‌యాన్ని బ‌హిరంగంగా అంగీక‌రించ‌లేదు కానీ ఒక‌రిపై ఒక‌రికున్న ప్రేమ‌ను ప‌రోక్షంగా తెలియ‌జేశారు. సోష‌ల్ మీడియాలో విఘ్నేశ్ అనేక సార్లు న‌య‌న‌తార‌ను పొగుడుతూ పోస్ట్ లు చేశాడు. ఇద్ద‌రూ క‌లిసి టూర్ ల‌కు వెళ్లిన ఫొటోల‌ను కూడా షేర్ చేసుకున్నారు. న‌య‌న‌తార ఎప్ప‌టిలానే వ్య‌క్తిగ‌త జీవితం గురంచి ఏమీ మాట్లాడ‌కుండా..వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంటోంది. అయితే తొలిసారి ఆమె ప‌రోక్షంగా విఘ్నేశ్ శివ‌న్ తో త‌న‌కున్న బంధాన్ని ప్ర‌స్తావించింది. ది హిందూ దిన‌ప‌త్రిక చెన్నైలో నిర్వ‌హించిన వ‌ర‌ల్డ్ ఆఫ్ ఉమెన్ -2018 అవార్డుల ప్ర‌ధానోత్స‌వం ఇందుకు వేదిక‌యింది.

ఈ కార్య‌క్ర‌మంలో న‌య‌న‌తార ఎక్స్ లెన్స్ ఇన్ ఎంట‌ర్ టైన్ మెంట్ అవార్డును అందుకుంది. అనంత‌రం వేదిక‌పై ప్ర‌సంగించిన న‌య‌న‌తార త‌న‌ను నిరంత‌రం ప్రోత్స‌హిస్తున్న త‌న త‌ల్లి, తండ్రి, సోద‌రుడికి, త‌న కాబోయే భర్త‌కు ధ‌న్య‌వాదాలు తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు తాను పాల్గొన్న అవార్డుల కార్య‌క్ర‌మానికి, ఈ కార్య‌క్ర‌మానికి చాలా తేడాఉంద‌ని, ఇక్క‌డ త‌న చుట్టూ ఉన్న మ‌హిళ‌లు సాధించిన విజ‌యం త‌న‌లో మ‌రింత స్ఫూర్తి నింపింద‌ని న‌య‌న‌తార చెప్పింది. ఆమె మాటల్లో మిగ‌తావిష‌యాల‌ను ప‌క్క‌న‌పెడితే..విఘ్నేశ్ శివ‌న్ ను కాబోయే భ‌ర్త‌గా చెప్ప‌డ‌మే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విఘ్నేశ్ త‌మిళంలో ప‌లు హిట్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు విఘ్నేశ్, న‌య‌న్ కాంబినేష‌న్లో వ‌చ్చిన తొలి సినిమా నేనూ రౌడీనే స‌మ‌యంలో వారిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డ్డ మ‌రిచ‌యం త‌ర్వాతి రోజుల్లో ప్రేమ‌గా మారింది.