దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి నయనతార ఒకరు.ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె డైరెక్టర్ విగ్నేష్ ను పెళ్లి చేసుకున్నారు.వీరి వివాహం తర్వాత నయనతార సరోగసి ద్వారా పిల్లలకు తల్లిగా మారిపోయారు.దీంతో ఈమె ఎన్నో వివాదాలలో చిక్కుకున్నారు అయితే అందుకు తగ్గ సాక్షాలు అన్నిటిని చూపించడంతో ఈ వివాదానికి చెక్ పెట్టినట్లు అయింది.
అయితే ప్రస్తుతం నయనతార తన భర్త పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా గడపడమే కాకుండా మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి నయనతార మొదటిసారి బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తో కలిసి జవాన్సి నిమాలో నటించారు.ఈ సినిమా ద్వారా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఎంత చురుగ్గా పాల్గొన్నారు.కానీ నయనతార మాత్రం ఎక్కడ ప్రమోషన్ కార్యక్రమాలలో కనిపించడం లేదు.తన సొంత సినిమాలను భారీగా ప్రమోట్ చేసుకునే నయనతార తాను హీరోయిన్గా నటించిన సినిమా ప్రమోషన్లకు మాత్రం దూరంగా ఉంటున్నారు.ఎప్పుడూ కూడా సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కారు కానీ మొదటిసారి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇలాంటి తరుణంలోనే నయనతార ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు.అయితే ఇందులో గెస్ట్ పాత్రలో నటించినటువంటి దీపికా పదుకొనే ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.దీంతో ఈ సినిమాలో హీరోయిన్ నయనతార లేక దీపికా పదుకొనేనా అనే సందేహాలు అందరిలోనూ తలెత్తాయి.ఏది ఏమైనా నయనతార జవాన్ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండటం అందరిని కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.