అతి చిన్న వయస్సులో నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డమ్‌కి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి గ్రాడ్యుయేట్ పట్టా సాధించాడు. ఇందోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ-టీయూఈ నుండి లారెంట్ సిమోన్స్ బ్యాచిలర్ డిగ్రీని పొందాడు బెల్జియంలో పుట్టిన లారెంట్ ఎనిమిదేళ్లకే హైస్కూల్ విద్యను పూర్తి చేసి డిసెంబరులో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు.
హైస్కూల్ చదువు పూర్తి అయిన నెల రోజులకే డిగ్రీ పొంది తొమ్మిది నెలల్లోనే చదువు పూర్తి చేశాడు. ఇంకా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ కూడా చేసే ఆలోచనలో ఉన్నాడు. పీహెచ్‌డీ చేస్తూ మెడిసిన్లోనూ డిగ్రీ చదువుతానని చెప్తు అందరినీ ఆశ్చర్యపడేలా చేస్తున్నాడు. అతి చిన్న వయస్సులో డిగ్రీ పూర్తిచేసిన వ్యక్తిగా రికార్డులకి ఎక్కనున్నాడు.
ముందుగా లారెంట్స్ లోని టాలెంట్ ను గుర్తించింది అతని తాత, నానమ్మనే అట. నాలుగేళ్ల వయసులో స్కూల్కు వెళ్లిన లారెంట్స్ 12నెలల్లో ఐదేళ్ల చదువు పూర్తి చేసేశాడు. అతడి తల్లిదండ్రులు లిదియా, అలెగ్జాండర్ సిమ్మన్స్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే లారెంట్ ప్రతిభా పాటవాలు కనబరిచే వాడని తెలియ చేశారు. చదువుకు మాత్రమే పరిమితమై ఉండక ఆట పాటల్లో కూడా ముందుంటాడని చెప్పారు. ఇన్‌స్టాగ్రాంలో 11వేల మంది ఫాలోవర్లు లారెంట్స్ కి ఉన్నారని తెలిపారు.