‘నీదీ నాదీ ఒకే కథ’ మూవీ రివ్యూ… తెలుగు బులెట్

Needi Naadi Oke Katha movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :    శ్రీ విష్ణు, సాత్నా టైటస్, దేవి ప్రసాద్
నిర్మాతలు :      ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణ రావు
దర్శకత్వం :     వేణు ఊడుగుల‌
సినిమాటోగ్రఫీ:  రాజ్ తోట‌
ఎడిటర్ :    బొంతల నాగేశ్వర రెడ్డి
మ్యూజిక్ :   సురేశ్ బొబ్బిలి

శ్రీ విష్ణు… నారా రోహిత్ తో కలిసి అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో, మెంటల్ మదిలో లాంటి విభిన్నమైన సినిమాలో నటించి నటుడిగా మంచి గుర్తింపు త్యేచుకున్నాడు. ఇప్పుడు ‘నీదీ నాదీ ఒకే కథ’ అనే చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఇంతక ముందు సినిమాలులా శ్రీ విష్ణుకు మరో విజయాన్ని అందించిందా..? లేదో? చూడాలంటే ఒకసారి రివ్యూ లోకి వెళ్ళాల్సిందే?

క‌థ‌:

రుద్ర‌రాజు దేవీ ప్ర‌సాద్ ఒక మంచి టీచర్. ఉ‍న్నత మైన చదువు చదుకొని అద్భుతమైన టీచర్ గా సమాజంలో పరువు ప్రతిష్ట సంపాదించుకుంటాడు. అలాంటి వ్య‌క్తి కి చదువు పెద్దగా అబ్బనీ ఒక కొడుకు రుద్ర‌రాజు సాగ‌ర్ (శ్రీవిష్ణు) ఉంటాడు. ఎప్పుడూ ప‌రీక్ష‌లు త‌ప్పుతూ, తన చెల్లెలితో కలిసి మళ్లీ ఎగ్జామ్స్‌ రాస్తూ ఉంటాడు. అతని పనులు వలన తండ్రికి రోజురోజుకూ అసహనం పెరుగుతూ వస్తుంది. ఒకరోజు అనుకోకుండా సాగ‌ర్‌కి ధార్మిక (సాత్నా టైట‌స్‌) ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఎలాగైనా తన తండ్రి కోరుకున్నట్టుగా మారాలని ఆమె మార్గంలో న‌డుస్తూ, తన సహాయం తీసుకుంటూ ఉంటాడు‌. కానీ ఇలా మారడం వలన తన ఆనందాలను కోల్పోవటాన్ని గమనిస్తాడు. ఆ విష‌యాన్ని తండ్రితో చెప్పే ప్ర‌య‌త్నం చేస్తాడు. తండ్రి కి చెప్పాక అసలు ఏమవుతుంది? చివరకు తండ్రి కోరుకున్నట్టుగా మారాడా..? లేక త‌న‌కు న‌చ్చిన‌ట్టు ఉన్నాడా? అసలు ధార్మిక వలన సాగ‌ర్‌కి కలిగిన ఉపయోగం ఏంటి ? ఈ విషయాలు అన్ని తెలుసుకోవాలంటే మూవీ చూడల్సిందే…

ఈ చిత్రం మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే సమస్యల నేపథ్యంలో తెరకెక్కినది. ఈ సినిమాలో పోటీ ప్రపంచంలో చదువులు, ర్యాంకుల కోసం పరుగులు, పరువు ప్రతిష్టల కోసం తల్లిదండ్రులు పిల్లలను పెట్టే ఇబ్బందులు, వాటి వల్లే పిల్లలు పడే ఒత్తిడి, దానివలన వాళ్ళు అనుభవించే మానసిక క్షోభ గురించి ఈ చిత్రంలో చూపించారు. ఎప్పుడూ జల్సా చేసుకుంటూ, భాద్యతలు తెలుసుకోకుండా… జీవితంలో ఏది సాధించలేననే భయంతో బతికే కుర్రాడిగా శ్రీవిష్ణు నటించాడు. అందరి మధ్య తరగతి తండ్రులు లాగే తన కొడుకు జీవితంలో ఉన్నతంగా సెటిల్ అవ్వాలన్న తండ్రి పాత్రలో దేవీ ప్రసాద్ బాగా నటించాడు. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సాట్నా టిటస్‌కు ఈ సినిమాలో హీరోయిన్ గా బాగా నటించింది. హీరో చెల్లెలు, త‌ల్లి పాత్ర‌ధారులు కూడా మెప్పించారు.

మధ్య తరగతి కుటుంబాల్లో ప్రతీ ఇంట్లోను ఉండే సమస్యలనే కథాగా తీసుకొని దర్శకుడు వేణు ఊడుగుల మంచి మార్కులు సంపాదించాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రతీ ప్రేక్షకుడు ఏదో ఒక సన్నివేశంలో ఇది నా ఇంట్లో జరిగే సన్నివేశమే కదా అని ఫీల్ అవుతాడు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా సురేష్‌ బొబ్బిలి పని చేసాడు. ఈ సంగీతం కూడా సినిమాకు కొంచెం బలం అని చెప్పవచ్చు. ప్రతీ పాట కథలో భాగంగా వస్తూ, పోతుంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్‌ బొబ్బిలి తన నేపథ్య సంగీతంతో కథలోని భావోద్వేగాలను మరింతగా ఎలివేట్ చేశాడు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్‌ బాగుంది. సినిమాటోగ్రఫి బాగుంది, నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

కథా, కథనం
శ్రీ విష్ణు నటన
హీరోయిన్ న‌ట‌న‌
దేవీ ప్రసాద్ నటన

మైనస్ పాయింట్స్ :

స్లో నెరేషన్
ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపులు లేక‌పోవ‌డం

తెలుగు బులెట్ రేటింగ్… 2.75 /5 .