Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘క్వీన్’ చిత్రాన్ని సౌత్‌లో నాలుగు భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగు మరియు మలయాళం వర్షన్‌లకు విభిన్న చిత్రాల దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళం మరియు కన్నడ వర్షన్‌లకు మరో దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. నాలుగు భాషల్లో కూడా ఒకే సారి చిత్రీకరణ జరుపుకుంటుంది. నిర్మాత ఒక్కడే అవ్వడంతో చిత్రీకరణ అన్నింటికి ఒకేచోట, ఒకే సమయంలో జరుగుతున్నారు. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. రెండవ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ సమయంలోనే తెలుగు వర్షన్‌కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
తెలుగు వర్షన్‌లో క్వీన్‌గా తమన్నా నటిస్తున్న విషయం తెల్సిందే. షూటింగ్ సందర్బంగా హీరోయిన్ తమన్నాకు దర్శకుడు నీలకంఠకు మద్య విభేదాలు వచ్చాయని, దాంతో తెలుగు వర్షన్ దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. మలయాళ వర్షన్‌కు మాత్రమే దర్శకత్వం వహిస్తాను అంటూ నీలకంఠ అంటూ ఉన్నాడట. దాంతో నిర్మాత తల పట్టుకున్నాడు. దర్శకుడు నీలకంఠ మరియు హీరోయిన్ తమన్నాల మద్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమన్నా కూడా ఆ దర్శకుడితో వర్క్ చేయను అంటూ గట్టిగా చెప్పేసిందట. దాంతో చేసేది లేక నిర్మాత మరో దర్శకుడిని అన్వేషిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. మలయాళంకు మాత్రం నీలకంఠ కొనసాగే అవకాశాలున్నాయి.