తెలుగు ‘క్వీన్‌’ ఖేల్‌ ఖతం…

Tamanna Reacts on Queen Movie remake in telugu Rumours

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన ‘క్వీన్‌’ చిత్రాన్ని సౌత్‌లో నాలుగు భాషల్లో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో వేరు వేరు హీరోయిన్స్‌తో ఒకే నిర్మాత వేరు వేరు దర్శకులతో రీమేక్‌ చేస్తున్నాడు. ఇటీవలే యూరప్‌లో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని వచ్చారు. నాలుగు భాషల్లో కూడా ఒకే సారి చిత్రీకరణ జరుపుతూ ఒకే సారి విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. మొదటి షెడ్యూల్‌కు భారీ ఎత్తున ఖర్చు చేశారని, బడ్జెట్‌ సమస్యలు మొదలయ్యాయి అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలు నిజం కాదని, బడ్జెట్‌కు ఎలాంటి సమస్య లేకుండా సినిమా షూటింగ్‌ సాగిపోతుందని నిర్మాత చెప్పుకొచ్చాడు. అంతా సాఫీగా సాగుతుందని భావిస్తున్న సమయంలో తెలుగు వర్షన్‌కు దర్శకత్వం వహిస్తున్న నీలకంఠతో హీరోయిన్‌ తమన్నాకు విభేదాలు అంటూ వార్తలు వచ్చాయి.

దర్శకుడు నీలకంఠతో తమన్నా విభేదాలు కూడా పుకార్లే అని తేలిపోయింది. స్వయంగా తమన్నా మాట్లాడుతూ దర్శకుడితో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చింది. తాజాగా మరోసారి తెలుగు క్వీన్‌ గురించిన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తమన్నా ఇచ్చిన డేట్లలో ‘క్వీన్‌’ చిత్రాన్ని పూర్తి చేయలేక పోయారని, ఇప్పుడు డేట్లు కావాలని అడుగుతుంటే తమన్నా మాత్రం ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాను అంటూ చెబుతూ వస్తుందని నిర్మాత ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తెలుగులో తమన్నాకు ‘క్వీన్‌’గా చేసేందుకు ఆసక్తిగా లేదు. అందుకే ఆమె ఇలా ప్రవర్తిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమన్నా డేట్లు ఇవ్వకుంటే తెలుగులో ‘క్వీన్‌’ పరిస్థితి అంతే అని సినీ వర్గాల వారు ఆందళన వ్యక్తం చేస్తున్నారు. మరి తమన్నా మనసు కరిగి మళ్లీ ‘క్వీన్‌’కు డేట్లు ఇస్తుందేమో చూడాలి.