తమన్నా కోరిక ఎవరు తీరుస్తారో ?

Who will satisfy Tamanna's desire?

ఇండస్ట్రీకి వచ్చి పుష్కరం దాటిపోతున్నా కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతుంది తమన్నా. తెలుగుతో పాటు తమిళ హిందీ కన్నడ సినిమాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది తమన్నా. ఇదిలా ఉంటే ఈ మధ్య అభినేత్రి 2 సినిమాలో నటించింది ఈ మిల్కీ బ్యూటీ. ఈ సందర్భంగానే మాటల్లో మాటగా ఇండస్ట్రీలో తనకు మిగిలిపోయిన ఒక కోరిక గురించి మీడియాతో పంచుకుంది తమన్నా. ఇన్నేళ్లలో ఎన్నో పాత్రలు చేసినా కూడా ఒక్క పాత్ర చేయడం మాత్రం తన జీవిత లక్ష్యం అంటోంది ఈ మిల్కీ బ్యూటీ. తమన్నాను అంతగా ఆకట్టుకున్న ఆ పాత్ర ఇంకేంటో కాదు అతిలోక సుందరి శ్రీదేవి. ఒకవేళ ఆమె బయోపిక్ తెరకెక్కిస్తే ఖచ్చితంగా శ్రీదేవి పాత్రల్లోనే నటించాలని ఉంది అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది తమన్నా. ఇప్పటికే ఈ విషయంపై బోనీ కపూర్ కు కూడా తన కోరికను తెలియజేశానని.. ఎవరు ఎప్పుడు శ్రీదేవి బయోపిక్ చేసినా కూడా తాను ఆమె పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెబుతోంది తమన్నా. అయితే శ్రీదేవి బయోపిక్ చేయడానికి బోనీ కపూర్ మాత్రం ఒప్పుకోవడం లేదు. వేరే వాళ్ళు చేసినా న్యాయపరంగా చర్యలు తీసుకుంటా అంటున్నాడు. ఇలాంటి సమయంలో తమన్నా కోరిక ఏ దర్శక నిర్మాత తీరుస్తాడో చూడాలి