తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2కు హోస్ట్‌గా నాని ఎంపిక అయిన సమయంలో అంతా కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ స్థాయిలో నాని అలరించగలడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. మొదటి రెండు వారాలు సో సోగానే అనిపించినా ఆ తర్వాత పర్వాలేదు అనిపించుకుంటూ షోను ముందుకు తీసుకు వెళ్తున్నాడు. ఇలాంటి సమయంలోనే నాని అనవసరంగా ప్రేక్షకులను మరియు సోషల్ మీడియా జనాలను గెలికి కూర్చున్నాడు. తాజాగా తేజస్విపై సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్న బూతుల గురించి నాని స్పందించాడు. ఆ సమయంలోనే కొందరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. మనుషులు కాదు అంటూ ట్రోలింగ్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాని వ్యాఖ్యలపై సీరియస్ అయిన జనాలు మరింతగా రెచ్చి పోతున్నారు.
నానిపై ఇప్పటికే అసంతృప్తితో ఉన్న ఒక వర్గం ప్రేక్షకులు ఇప్పుడు ఆయన్ను టార్గెట్‌గా చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. నానికి ఎన్టీఆర్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, ఎన్టీఆర్ హుందాగా షోను నడిపించాడు. కాని నాని ఫేవరేట్యిజంను చూపిస్తున్నాడు అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి కొందరు హిందీ బిగ్‌బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్‌కు నానిని పక్కన పెట్టి పోస్ట్ చేస్తున్నారు. బిగ్‌బాస్ ఇంట్లో గొడవ జరిగిన సమయంలో నాని వ్యవహరించే తీరు కూడా విమర్శలకు తావిస్తుంది. హిందీ బిగ్‌బాస్‌లో ఒకానొక సమయంలో ఒక ఇంటి సభ్యురాలు తీవ్రమైన పదజాలంతో రెచ్చి పోయింది. దాంతో వెంటనే ఆమెను ఇంటి నుండి బయటకు పంపించి, ప్రేక్షకులకు సల్మాన్ క్షమాపణలు చెప్పాడు. కాని తేజస్వి విషయంలో నాని అలా స్పందించకుండా, ఆమెకు మద్దతుగా నిలవడంతో పాటు, ఆమెపై విమర్శలు చేసిన వారిని తిట్టడంతో నానిపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది. నాని తీరు మార్చుకోవాలని లేదంటే ముందు ముందు కఠినంగా సోషల్ పోస్ట్‌లు చూడాల్సి వస్తుందని కొందరు హెచ్చరిస్తున్నారు.