Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మలయాళంలో ‘ప్రేమమ్’ చిత్రంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి తెలుగులో ‘ఫిదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిదాతో ఒక్కసారిగా తెలుగులో టాప్ హీరోయిన్ అయ్యింది. సాయి పల్లవి వెంట స్టార్ హీరోలు కూడా పడుతున్నారు. అయితే సాయి పల్లవి మాత్రం ఆచి తూచి సినిమాలు ఒప్పుకుంటుంది. తాజాగా నానితో ‘ఎంసీఏ’ చిత్రాన్ని పూర్తి చేసిన ఈ అమ్మడు శర్వానంద్‌తో సినిమాకు కమిట్ అయ్యింది. ఇక ఈమె గతంలో మలయాళంలో నటించిన ‘కాళి’ అనే చిత్రం తెలుగులో డబ్ అయ్యింది. సాయి పల్లవికి ఇక్కడ ఉన్న క్రేజ్‌తో ఆ సినిమాకు మంచి క్రేజ్ దక్కింది.
నేడు ‘హేయ్ పిల్లగాడ’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి ఆకట్టుకోలేక పోయింది. ‘ఫిదా’ చేసిన సాయి పల్లవికి తెలుగులో మొదటి ఫ్లాప్‌గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా వల్ల సాయి పల్లవి క్రేజ్ తగ్గిందని చెప్పుకోవచ్చు. సాయి పల్లవి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయవద్దని కోరుకుంది. కాని పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన నిర్మాత ఎందుకు ఆమె కోసం సినిమాను విడుదల చేయకుంటా ఉంటాడు. అనుకున్నట్లుగానే హేయ్ పిల్లగాడ చిత్రం ఆకట్టుకోలేక పోయింది. ‘హేయ్ పిల్లగాడ’ చిత్రం తెలుగులో సక్సెస్ కాదని ముందే గ్రహించిన సాయి పల్లవి ఈ సినిమా ప్రమోషన్‌కు దూరంగా ఉంది. వచ్చే నెలలో ‘ఎంసీఏ’ చిత్రంతో సాయి పల్లవి ఖచ్చితంగా సక్సెస్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. అప్పుడు ‘హేయ్ పిల్లగాడ’ ఫ్లాప్‌ను పూడ్చే అవకాశం ఉంది.