ఈసారి హీరోయిన్‌కు గాయాలు

Nela Ticket Movie Makers refuse to Rumors Malvika Sharma

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
‘టచ్‌ చేసి చూడు’ చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ భారీ డిజాస్టర్‌ చవి చూశాడు. ఆ చిత్రం ఫ్లాప్‌ నుండి వెంటనే బయట పడ్డ రవితేజ ప్రస్తుతం ‘నేల టికెట్‌’ చిత్రాన్ని కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజకు జోడీగా మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌లో రవితేజ గాయపడ్డాడు అని, స్పోర్ట్స్‌ బైక్‌ను రైడ్‌ చేస్తున్న సమయంలో రవితేజ అదుపుతప్పి కింద పడ్డాడు అని, దాంతో ఆయనకు గాయాలు అయ్యాయి అంటూ నిన్న మొన్నటి వరకు వార్తలు వస్తున్నాయి. తాజాగా హీరోయిన్‌ మాళవిక శర్మకు షూటింగ్‌లో గాయాలు అయ్యాయి అంటూ ప్రచారం జరుగుతుంది.

మాళవిక శర్మకు గాయాలు అయ్యాయి అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. మాళవిక శర్మకు ఎలాంటి గాయాలు కాలేదని, ఆమె నిశ్చేపంగా షూటింగ్‌లో పాల్గొంటుంది అంటూ దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ చెప్పుకొచ్చాడు. నిన్నటి వరకు రవితేజ గురించి మీడియాలో వార్తలు రావడం, ఇప్పుడు హీరోయిన్‌ గురించి పుకార్లు రావడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీడియా వారు ఏదైనా వార్తను నిర్ధారించుకుని రాయాలని, ఇలా పిచ్చి పుకార్లను ప్రచారం చేయవద్దని నిర్మాతలు కోరుతున్నారు. ఇక ‘నేల టికెట్‌’ చిత్రం డబ్బింగ్‌ రైట్స్‌ ఏకంగా 25 కోట్లకు అమ్ముడు పోవడంతో ఈ సినిమా స్థాయి ఏంటో తెలిసి పోయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తిగా ఉన్నారు.