ట్రైలర్‌ రివ్యూ : బాబోయ్‌.. ఇది తేజ సినిమానేనా?

Nene Raju Nene Mantri Telugu Movie Trailer Review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

 Nene Raju Nene Mantri Telugu Movie Trailer Review

ఒకప్పుడు తేజ సూపర్‌ హిట్‌ చిత్రాలను అందించాడు. ఎన్నో అద్బుతమైన ప్రేమ కథలను తెరకెక్కించి యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. అయితే గత కొంత కాలంగా తేజకు బ్యాడ్‌ టైం నడుస్తుంది. ఈ జనరేషన్‌కు తగ్గట్లుగా తేజ సినిమాలు చేయలేడు అంటూ విమర్శలు వచ్చాయి. ఇక తేజ సినిమాలకు గుడ్‌ బై చెప్పడం మంచిదని ఆయన చివరి సినిమా విడుదల తర్వాత అంతా అన్నారు. అయితే తాజాగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ట్రైలర్‌ను చూస్తుంటే మాత్రం షాక్‌ అవ్వాల్సిందే. రానా, కాజల్‌ జంటగా తెరకెక్కిన ఈ సినిమా తేజ తన మార్క్‌కు పూర్తి విభిన్నంగా ఈ సినిమాను తెరకెక్కించి ఆకట్టుకుంటున్నాడు.

టీజర్‌తోనే సినిమాపై ఆసక్తిని కలిగించిన దర్శకుడు ఇప్పుడు ట్రైలర్‌ను తీసుకువచ్చి షాక్‌ ఇచ్చాడు. పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంది. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా, చూద్దామా అన్నట్లుగా ట్రైలర్‌ ఉంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా చేసిన పాత్ర అద్బుతం అని చెబుతున్నారు. వంద మంది ఎమ్మెల్యేలను హోటల్‌లో పెడితే నేనే సీఎం, సీఎం సీటు నా ముడ్డి కింద ఉండాలి అంటూ రానా చెప్పిన డైలాగ్స్‌ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకు వెళ్తున్నాయి. ఇక ఈ సినిమాలో భారీ యాక్షన్‌ సీన్స్‌ మరియు రానా, కాజల్‌ల మద్య రొమాంటిక్‌ సీన్స్‌ కూడా ఉన్నాయి. మొత్తంగా ఇదో తేజ సినిమా మాదిరిగా అనిపించడం లేదు. ఇప్పటికి అయినా తేజ తన రూటు మార్చుకుని ఇలాంటి సినిమాు చేయడం అభినందనీయం. ఈ చిత్రం సక్సెస్‌ అయ్యి తేజ మళ్లీ మునుపటి క్రేజ్‌ను దక్కించుకుంటాడేమో చూడాలి.


మరిన్ని వార్తాలు:

డీజే దుమ్ము రేపాడు – దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ రివ్యూ