ప్రమాదం: ఇండియా నుంచి నేపాల్ వెళ్తున్న 11మంది వలస కూలీలు మృతి….

కరోనా వలస కూలీలకు శాపంగా మారిందా? .కరోనా.. లాక్ డౌన్ సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా భారత్‌ నుంచి నేపాల్‌ వెళ్తున్న వలస కూలీలు సొంతూళ్లకు చేరుకోకముందే మృత్యువాత పడ్డారు.

భారత్‌లోని పలు ప్రాంతాలనుంచి 30 మందికిపైగా వలస కార్మికులు ప్రత్యేక బస్సులో నేపాల్‌ బయలుదేరారు. అయితే ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత నేపాల్‌లోని బాంకే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై 11మంది వరకు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే వీళ్లు ప్రయాణిస్తున్న బస్.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కుని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో బస్సు డ్రైవర్‌తో పాటు 11 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే.. మరో 22 మంది గాయపడ్డారని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. కాగా గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. కాగా ఇప్పటివరకు నేపాల్‌లో 1572 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 8మంది మృతి చెందారు.