కరోనా కాలంలో వలస జీవులకు సాయం చేసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇప్పటికి తన సేవ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. విదేశాల్లో ఉన్న వారిని స్వదేశానికి రప్పించడం, పేదలకు వైద్యం చేయించడం అలా ఎన్నో సామాజిక సేవలు చేస్తూనే ఉన్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి నిరవధికగా చేయూతనందిస్తున్న ఆయనను ట్రోల్స్ వెంటాడుతున్నాయి. ఆయన చేస్తున్న సామాజిక సేవను తప్పు బడుతూ ట్రోలర్స్ టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూ సూద్ విమర్శకులకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘నేను చిన్నపుడు ఒక కథ విన్నాను. ఒక సాధు(గాడ్మాన్) దగ్గర అద్భుతమైన గుర్రం ఉంది. ఒక బందిపోటు సాధు దగ్గరకు వచ్చి అతనికి ఆ గుర్రాన్ని ఇవ్వమని కోరాడు. సాధు నిరాకరించి ముందుకు వెళ్లిపోయాడు’
‘‘సాధు అడవి గుండా వెళుతుంటే అక్కడ నడవలేని ఓ వృద్ధుడిని గమనించాడు. గుర్రాన్ని వృద్ధుడికి ఇచ్చాడు. ఆ వృద్దుడు గుర్రంపై కుర్చున్న క్షణం తనను తాను ఒక బందిపోటుగా పిలుచుకున్నాడు. అలా ఆ గుర్రంతో కాస్తా ముందుకు కదిలాడు. ఇక సాధు సదరు వృద్ధుడిని ఆపి నువ్వు ఈ గుర్రాన్ని తీసుకెళ్లవచ్చని చెబుతాడు. కానీ ఈ గుర్రాన్ని నేను ఎలా ఇచ్చానన్న విషయాన్ని ఎవరికి చెప్పోద్దని వృద్దుడికి చెబుతాడు.
అతడు ఎందుకు అని అడగ్గా.. ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ మంచి పని చేసేవారిని నమ్మరు అని చెబుతాడు’ అని చెప్పి ట్రోలర్స్‌కు కూడా నా సమాధానం ఇదే ఆయన అన్నారు. మీరు ఏం చేసిన అది నన్ను ప్రభావితం చేయదు. నేను చేయాలనుకున్నది చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అదే విధంగా తను అందరిని మోసం చేస్తున్నానని, తను ఏం చేయలేదు అని విమర్శించే వారికి కూడా ఆయన ఈ సందర్భంగా గట్టి సమాధానం ఇచ్చారు.
‘‘నేను ఏమి చేఊయలేదని నాది మోసం అనే వారికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేను ఇదంతా మీ మెప్పు కోసం చేయట్లేదు. అలాగే నేను సాయం చేసిన వారి డేటా అంతా నా దగ్గర ఉంది. వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు నా దగ్గర ఉన్నాయి. అంతేకాదు విదేశాల నుంచి తీసుకువచ్చిన విద్యార్థుల వివరాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను స్పష్టం చేయాలనుకోవట్లేదు.. కానీ నన్ను విమర్శించేందుకు బదులుగా బయటకు వెళ్లి ఎవరికైనా సాయం చేయాలని కోరుతున్న’’ అంటూ సమాధానం ఇచ్చారు. అంతేగాక ప్రస్తుతం తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని మరోసారి ఆయన స్ఫష్టం చేశారు.