జీవిక రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఇద్దరు తీవ్రంగా గాయాల పాలైనారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగినది. హుటాహుటిగా పోలీసులు,అగ్నిమాక సిబ్బంది భవనం శిథిలాల్లో చిక్కుకున్న అన్వర్, అంబరీష్‌ను బయటకు తీశారు.
అక్కడికక్కడే ఒక కార్మికుడు మృతి చెందగా, మరో కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చని పోయాడు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 20మంది కార్మికులు పని చేస్తుండగ ఈ ఘటనలో అగ్నిమాక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
పరిశ్రమ భవనం పైకప్పు, గోడలు భారీ పేలుడు ధాటికి దెబ్బతిన్నాయి. రసాయన పరిశ్రమ కావడంతో పేలుడు తీవ్రతకు వాయువులు వెలువడడం వల్ల సహాయక చర్యలు చేపట్టేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు కష్టంగా మారింది. పోలీసులు రియాక్టర్ వద్ద విధులు నిర్వహిస్తున్న బిహార్‌కు చెందిన అన్వర్, అంబరీష్ మృతి చెందినట్లు వెల్లడించారు.