భయపెడుతున్న జెస్సీ ఫస్ట్ లుక్…!

New Director Aswani Kumar Jessie Movie First Look Release

హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు ఉన్న క్రేజ్ వేరు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి టాలీవుడ్‌ లో చాలా చిత్రాలు వచ్చాయి. అయితే ఎన్ని చిత్రాలు వచ్చినా హారర్ చిత్రాలకు సెలెక్టెడ్ ఆడియన్స్ ఉండటంతో భయపెట్టేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటారు. ఇప్పుడు అదే కోవలో జెస్సీ అనే సినిమా రాబోతుంది. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న జెస్సీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.

New Director Aswani Kumar Jessie Movie First Look Release

ఆషియా నర్వాల్, శ్రితాచందనన్, పావని గంగిరెడ్డి, అర్చనా, అతుల్ కులకర్ణి, కబీర్ సింగ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. శ్వేతా సింగ్ ప్రొడ్యూస్ చేస్తుండగా, అశ్వనీ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ్‌లో రిలీజ్ చెయ్యనున్నారు. మార్చి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తుంది.