మెటా కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ త్వరలోనే సరికొత్త పాలసీను ముందుకు తెచ్చే ఆలోచనలో ఉంది. కొత్తగా అకౌంట్ క్రియోట్ చేసే వారు కచ్చితమైనా ఫ్రూఫ్స్ ఉంటేనే సైన్ ఆప్ అయ్యే అవకాశాన్ని కల్పించేలా ఇన్‌స్టాగ్రామ్ ప్లాన్ చేస్తోంది. కొత్త యూజర్ తీసుకున్న సెల్ఫీ వీడియోను అప్‌లోడ్ చేస్తేనే కొత్త ఖాతాను ఆలో చేయాలని ఇన్‌స్టాగ్రామ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫీచర్ గత ఏడాది నుంచే ఇన్‌స్టాగ్రామ్ పరీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. సోషల్‌మీడియా కన్సల్టెంట్ మాట్ నవారా ఇన్‌స్టాగ్రామ్ త్వరలోనే తెచ్చే ఫీచర్ స్క్రీన్ షాట్‌లను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
ఒక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో మల్టీపుల్ ఖాతాలను ఏర్పాటు చేయడంతో ఆయా వ్యక్తులు అసంఘిక కార్యకాలపాలకు పాల్పడుతున్నుట్లు ఇన్‌స్టాగ్రామ్ గుర్తించింది. దీంతో ఆయా యూజర్లకు చెక్‌పెట్టేందుకు ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్‌ను తెస్తున్నట్లుగా తెలుస్తోంది. మల్టీపుల్ ఖాతాలను క్రియోట్ చేసే వారి ఆట కట్టించేందుకు ఇన్‌స్టాగ్రామ్ ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది.