తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు ప్రకటించిందని..బిజెపి ఎంపి లక్ష్మణ్ కీలక ప్రకటన చేశారు. 434 కి.మీ మేర కొత్త లైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వివరించారు. కేంద్రం ప్రకటించిన రైల్వే ప్రాజెక్టులపై తండ్రి కొడుకుల స్పందన ఏది అంటూ ఫైర్ అయ్యారు.తెలంగాణాకు రైల్వే ప్రాజెక్టులతో మేలు జరగనుందని.. ట్విట్టర్ టిల్లు ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు.
కేంద్రం నిర్ణయాలు కెటిఆర్ కు కనువిప్పు కలగాలని..తెలంగాణా లో అభివృద్ధి పనులకు ప్రధానిని ఆహ్వానిస్తామన్నారు. మణిపూర్ అంశాన్నిపార్లమెంట్ లో అడ్డుపెట్టిన ప్రతిపక్షాలు ఆందోళన చేశాయని..అవిశ్వాసాన్నిపార్లమెంట్ లో ప్రకటించిన విపక్ష కూటమికి చెంపపెట్టు జరిగిందని వెల్లడించారు.భవిష్యత్ ఎన్నికలలో వాళ్ళకు ప్రతిపక్ష పాత్రేనని..మోడి ముచ్చటగా మూడో సారి పిఎం అవుతారని స్పష్టం చేశారు.ప్రత్యేక ప్రణాళికతో తెలంగాణాలో అధికారంలోకి రావడానికి చేస్తున్నట్లు బిజెపి ఎంపి లక్ష్మణ్ వెల్లడించారు.