ఏప్రిల్ ఒకటి నుండి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో ప్రజల ఆర్థిక లావాదేవీల విషయాల్లో చాలా చాలా మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వినియోగదారులు విషయంలో కొన్ని మార్పులని బాగా గమనించాల్సి ఉంటుంది. ఎస్బిఐ కార్డ్ ,ఐసిఐసిఐ బ్యాంక్ ,ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు కొత్త నిబంధన విషయం లో చాలా అలర్ట్ గా ఉండాలి. రివార్డ్స్ క్యాష్ బ్యాక్ లో వంటి వాటిలో బాగా మార్పులు వచ్చాయి. అయితే బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ విషయంలో ఏ నిబంధనలు తీసుకువచ్చాయో అనేది తెలుసుకుందాం.

New Regulations on Credit Cards from April 1
యాక్సిస్ బ్యాంక్ దేశి అంతర్జాతీయ లాంజ్ ప్రోగ్రాంలోకి వర్తించే కాంప్లిమెంటరీ గెస్ట్ సందర్శన సంఖ్యను ఎనిమిది నుండి నాలుగు కు తగ్గించింది. ఐసిఐసిఐ బ్యాంక్ రివార్డ్ పాయింట్ ఆదాయాలు లాంజ్ యాక్సెస్ వార్షిక రుసుము మినహాయింపు నియమాల్లో మార్పులను చేసింది . స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లింపులు చేసినట్లయితే ఎటువంటి రివార్డ్ పాయింట్లు అనేవి రావు. క్రెడిట్ కార్డులలో ఎస్బిఐ కార్డ్ ఎలైట్ ఎస్బిఐ కార్డ్ ఎలైట్ అడ్వాంటేజ్ ఎస్ బి ఐ కార్డ్ ప్లస్ సింప్లి క్లిక్ ఎస్బిఐ కార్డు వంటి వాటిపై ఆర్థిక సంవత్సరం నుండి బాగా ప్రభావం ఉండనుంది.