ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త రూల్ అమలులోకి వచ్చింది… ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించే వారికోసం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త రకమైన రూల్ ని తీసుకొచ్చింది. ఇకనుండి ఎవరైనా కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే ఇక వారిని జైలుకు పంపించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు పోలీసులు. అయితే ఇన్నిరోజులు కూడా కేవలం జరిమాణాలతో సరిపెట్టిన రవాణా శాఖ, ఎంతకీ కొందరు వాహన దారుల ప్రవర్తన మారకపోవడంతో విసుగుచెంది, ఇకనుండి రూల్స్ ని అతిక్రమించే వారిపై కఠినమైన చర్యలను తీసుకోడానికి సీఎం జగన్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుందని చెప్పాలి.
అయితే 2019లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 88,872 మంది వాహన చోదకులు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం. ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించేవారివల్లే అధిక మొత్తంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకనే రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ ఖఠినమైన చర్యలను అమలు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇలాగైనా కొందరు ఆకతాయిల వలన రోడ్డు ప్రమాదాలు ఆగుతాయో లేదో చూడాలి.