ప్రణయ్ హత్య విషయం లో మాజీ ఏం ఎల్ ఏ వేముల వీరేశం పాత్ర ఉందని అమృత ఆరోపణ చేసింది. తన తండ్రికి వీరేశం కి మంచి సంబంధాలు ఉన్నాయని, చాలా సార్లు మమ్మల్ని ఫోన్ చేసి బెదిరించారని, తన మామ ఎమ్మెల్సీ ఉద్యోగిగా పనిచేస్తుండగా తన పై తప్పుడు కేసులు పెట్టి నకిరికెల్ వెళ్ళాల్సింది గా సూచించారని అమృత ఆరోపించారు.
ఆ సమయం లో ఎస్పీ శ్రీనివాస్ రావు, డీఎస్పీ శ్రీనివాసులు జోక్యం చేసుకోవడంతో తప్పుడు కేసు తొలగించారన్నారు. ప్రణయ్ హత్య లో వీరేశం పై విచారణ జరపాలని అమృత కోరారు.ఇదిలా ఉండగా అమృత ఆరోపణల పై పోలీసులు స్పందించారు. ఈ హత్యకు వీరేషానికి ఎలాంటి సంబంధం లేదని ఎస్ పి రంగనాథం వెల్లడించారు.