Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ కు బెయిల్ ఇవ్వొద్దని కోరుతూ నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. గజల్ శ్రీనివాస్ సమాజంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి అని, ఆయన బయటకు వస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశముందని పేర్కొన్నారు. బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేయాల్సిఉందని, పలువురిని విచారించాల్సిఉందని తెలిపారు. మరోవైపు గజల్ శ్రీనివాస్ అకృత్యాలకు సంబంధించి మరిన్ని వేధింపుల వీడియోలు వెలుగుచూశాయి. ఇప్పటికే శ్రీనివాస్ బెడ్ పై అభ్యంతరకరస్థితిలో పడుకుని ఉండగా… ఆయన పనిమనిషి పార్వతితో పాటు బాధితురాలు ఆయన కాళ్లు నొక్కుతున్న వీడియో చక్కర్లు కొడుతుండగా… తాజాగా మరో రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి. బాధితురాలు పోలీసులకు మొత్తం 10 వీడియోలు అందించింది. వీటిల్లో కొన్ని వీడియోలు పోలీసుల ద్వారానే మీడియాకు చేరుతున్నాయి. ఆలయవాణి కార్యాలయాన్ని గజల్ శ్రీనివాస్ బ్రోతల్ హౌస్ గా మార్చారని, పలువురు అమ్మాయిలను అక్కడకు తెచ్చుకునేవారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.