Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
షార్ట్ ఫిల్మ్ నటి హారిక, దర్శకుడు యోగీ కేసు కొత్తమలుపు తీసుకుంది. తాను ఏ తప్పూ చేయలేదంటున్న ముత్యాల యోగికుమార్ హారికదే తప్పు అని ఆరోపిస్తూ పోలీసులకు కొన్ని సాక్ష్యాలు అందించాడు. హారిక తనకు పంపించిన వాట్సప్ మెసేజ్ ల స్క్రీన్ షాట్లను పోలీసులకు పంపించాడు. హారిక యోగీకి పంపినట్టుగా ఉన్న ఈ మెసేజ్ ల్లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆమె పలు విషయాలను యోగితో పంచుకుంది. తాను వ్యక్తిగతంగా ఆనందంగా లేనని, జీవితంపై తనకు విసుగొచ్చిందని హారిక తెలిపింది.
తనకు ఓ యువకుడి తోడు కావాలని, అతను ప్రేమ పంచుతూ తనను ఆప్యాయంగా చూసుకోవాలని కోరుకుంది. ఆ బాయ్ ఫ్రెండ్ అంగీకరిస్తే వేరే దేశానికి వచ్చేందుకు కూడా తాను సిద్ధమేనని, అక్కడే కొంతకాలం హాయిగా బతకాలని ఉందని చెప్పింది. తనకు సెక్స్ తో పనిలేదని, కానీ తనను చూసుకునే వ్యక్తికి అది కావాలంటే మాత్రం అభ్యంతరం లేదంది. సంతోషంగా లేనప్పుడు విలువలు ఎందుకు పాటించాలని ప్రశ్నించింది. మళ్లీ పెళ్లిచేసుకుంటే కెరీర్ పరమైన ఇబ్బందులు ఎదురవుతాయంది. తాను సిగరెట్, మద్యం తాగుతానని, ఈ కాలంలో మడిగట్టుకు కూర్చుంటే ఏం సాధించలేమంది. తనకు సినిమా అవకాశాలు రావడంలేదని, అవకాశాల కోసం ఏం చేయడానికైనా సిద్ధమని తెలిపింది. ఈ మెసేజ్ ల స్క్రీన్ షాట్స్ ను యోగీ పోలీసులకు అందించాడు.