దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బాయ్స్ లాకర్ రూమ్’ కేసులో మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అదేమంటే.. తమ క్లాస్మేట్స్ అమ్మాయిల బాడీ షేమింగ్‌పై మాట్లాడుతూ.. గ్యాంగ్ రేప్ చేద్దాం అంటూ కొందరు విద్యార్థులు చేసిన గ్రూప్ చాట్ సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ కి గురయ్యే నిజాలు బయటపడ్డాయి. ఓ టీనేజీ అమ్మాయే అబ్బాయిగా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అబ్బాయిలతో చాట్ చేసినట్లు విచారణలో తేలింది. తన శరీరంపై తానే అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ.. అందుకు అబ్బాయిలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని భావించే తాను ఈ పని చేసినట్లు విచారణలో పేర్కొన్నట్లు ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు.
అదేవిధంగా అబ్బాయిగా ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేసిన అమ్మాయి తన పేరు సిద్దార్థ్‌గా పరిచయం చేసుకుంది. ఆ తర్వాత తన శరీరంపై తనే అసభ్యకర వ్యాఖ్యలు చేసింది. దానిపై అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడో దాన్ని బట్టి తన క్యారెక్టర్ తెలుసుకోవచ్చని సదరు టీనేజీ అమ్మాయి విచారణలో స్పష్టం చేసిందని వారు వెల్లడించారు.
కాగా ఇప్పటివరకు అందరు అనుకున్నట్లుగా బాయ్స్ లాకర్ రూం పేరుతో కొంతమంది బాయ్స్ స్కూల్ స్టూడెంట్స్ అకౌంట్ క్రియేట్ చేసింది తప్పని తేలింది. అలాగే.. క్లాస్మేట్స్ అమ్మాయిల బాడీ షేమింగ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ చాటింగ్ చేసిన ఘటనలో తవ్వే కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
అయితే ఈ గ్రూప్‌లో వారంతా ఢిల్లీలోని ప్రముఖ స్కూల్లో చదువుతున్న విద్యార్థులే. దీంతో గ్యాంగ్ రేప్ చేద్దామంటూ సదరు విద్యార్థులు చాట్ చేసిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరంతా 18 ఏళ్లు అంతకంటే తక్కువ వయసు ఉన్నవారే. అమ్మాయిల ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా గ్రూప్‌లో చర్చించుకున్నారు. అందుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు 24 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తుండగా కొత్త కొత్త నిజాలు వెలుగుచూడటం విశేషం.