రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతంగా డిసెంబర్‌లో నెలలో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది డిసెంబర్లో 4,297 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డిసెంబర్ నుంచే నూతన మద్యం విధానం అమల్లోకి రావడం సహా ఏడాది చివరి నెలకావడం, కొత్త సంవత్సరం వేడుకలు ఉండటంతో అమ్మకాలు పెరిగియి. కొత్త సంవత్సరానికి 3, 4 రోజులు అధికంగా మద్యం అమ్ముడు పోవడం సర్వసాధారణం. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దుకాణదారులు భారీ ఎత్తున మద్యం నిల్వచేశారు.
ఈ క్రమంలోనే డిసెంబర్‌లోని చివరి నాలుగురోజుల్లో రూ.777 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా తీసుకుంటే గతేడాది కంటే రంగారెడ్డి, వరంగల్ జిల్లాలల్లో మాత్రమే అధికంగా అమ్ముడుపోయింది. ఆ రెండు జిల్లాల పరిధిలో 2022లో చివరి నాలుగు రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో 204 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోగా 2023 డిసెంబరులో అదే నాలుగు రోజుల్లో 242 కోట్లు విక్రయాలు జరిగాయి. వరంగల్‌లో 2022లో 64 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోయింది. 2023 డిసెంబర్ చివరన 70 కోట్లు విలువైన అమ్మకాలు జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి మిగిలిన అన్ని జిల్లాల్లో 2022 డిసెంబర్ చివరి నాలుగురోజులతో పోల్చుకుంటే 2023లో తక్కువ అమ్ముడుపోయింది.