న్యూజిలాండ్ పార్లమెంట్‌లో అరుదైన దృశ్యం ఆవిష్కతమైంది. స్పీకర్ ట్రేవర్ మల్లార్డ్ పసకందుకి సీసా పాలు పడుతూ.. పార్లమెంట్ లో చర్చను కొనసాగించడం అందర్నీ అబ్బురపర్చింది.
ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు విషయం ఏమిటంటే ఆదేశ ఎంపీ తమాతి కొఫీ ఈమధ్యే పండింటి పసికందును ప్రసవించింది. వెటర్నటీ లీవు కాస్తా ముగియడం, పార్లమెంట్ లో ముఖ్యమైన డిబేట్ పాల్గొనాల్సి వచ్చింది.
తల్లి డిబేట్ తో బిజీగా ఉండటంతో స్పీకర్ ట్రేవర్ ఆ పాపను ఆడించమే కాదు పాలు కూడా పట్టారు. మామూలుగా అయితే స్పీకర్ కుర్చీలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు కూర్చుంటారు. కానీ తనతోపాటు ఇవాళ ఓ వీఐపీ కొలువుదీరిందని ట్వీట్ చేసారు. మీ ఫ్యామిలీలోకి కొత్త సభ్యురాలు అడుగుపెట్టినందుకు శుభాకాంక్షలని ఎంపీ తమాతి కొఫి, టిమ్ దంపతులను అభినందిస్తూ ట్వీట్ పెట్టారు.
Normally the Speaker’s chair is only used by Presiding Officers but today a VIP took the chair with me. Congratulations @tamaticoffey and Tim on the newest member of your family. pic.twitter.com/47ViKHsKkA
— Trevor Mallard (@SpeakerTrevor) August 21, 2019