Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : ఆది, రష్మి, బ్రహ్మాజీ, వైభవి
నిర్మాత : బన్నీ వాసు
దర్శకత్వం : ప్రభాకర్
మ్యూజిక్ డైరెక్టర్ : సాయికార్తీక్
మంచి సబ్జెక్టు వున్న చిన్న సినిమాలు తీయడానికి మూడు పెద్ద సంస్థలు వేసిన తొలి అడుగు నెక్స్ట్ నువ్వే సినిమా. గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు v4 పేరుతో ఒకే వేదికపై నిర్మించిన సినిమా నెక్స్ట్ నువ్వే. టీవీ నటుడు ప్రభాకర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ , ప్లాప్ లతో వున్న హీరో ఆది కి ఇంకో ఛాన్స్ ఇస్తూ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులకి ఎలాంటి అనుభవాన్ని ఇచ్చిందో చూద్దాం.
కథ…
కిరణ్ (ఆది) ఓ టీవీ సీరియల్ దర్శకుడు. అతగాడికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. కానీ ఎంజాయ్ చేయడానికి వీల్లేకుండా అప్పులు కూడా ఉంటాయి. అప్పులు ఇచ్చిన జయప్రకాశ్ రెడ్డి పెట్టే వేధింపులు తట్టుకోలేకపోతుంటాడు. ఇంతలో అప్పుడెప్పుడో తన తండ్రి కొన్న ఓ పాత ఆస్తి గురించి కిరణ్ కి తెలుస్తుంది. అదెక్కడో వున్న ఓ ఓల్డ్ బిల్డింగ్. దాన్ని బాగు చేయడానికి జయప్రకాశ్ కొడుకు దగ్గరే మళ్లీ డబ్బు లాగుతాడు కిరణ్. మొత్తానికి ఆ బిల్డింగ్ బాగు చేయించి అక్కడ హోటల్ పెట్టేస్తాడు. దీని ద్వారా వచ్చిన ఆదాయంతో అప్పులు తీర్చి లైఫ్ లో సెటిల్ అయిపోవాలని కిరణ్ ప్లాన్. అక్కడికి కిరణ్ తో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ వైభవి , శరత్ ( బ్రహ్మాజీ ) , శరత్ సోదరి ( రష్మీ ) కలిసి వెళతారు. అయితే ఆ హోటల్ కి వచ్చిన గెస్ట్ లు ఒకరి తర్వాత ఇంకొకరు చనిపోతుంటారు. దాంతో కిరణ్ అండ్ కో వణికిపోతారు. అసలు ఆ మరణాల వెనుక వున్న కారణం ఏంటన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ…
నెక్స్ట్ నువ్వే కథ లో గెస్ట్ లు ఒకరి తర్వాత ఇంకొకరు చనిపోతుంటారు. అలాంటి సీరియస్ విషయాన్ని కామెడీ మిక్స్ చేసి చెప్పాలి అనుకున్నప్పుడు స్క్రిప్ట్ లో పట్టు ఉండాలి. దెయ్యం భయంతో కామెడీ సృష్టించినట్టే చావుతో కూడా కామెడీ చేద్దాం అన్న ఐడియా తప్పా, కాదా అన్నది పక్కనబెడితే ఆ ప్రయోగం చేసేటప్పుడు స్క్రిప్ట్ చాలా బలంగా ఉండాలి. ప్రేక్షకుడి మది లాజిక్ వైపు వెళ్లకుండా వినోదంలో మునిగిపోయేలా ఉండాలి. అయితే అదే ఇక్కడ లోపించింది. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడో చోట ఏదో ఒక హారర్ సినిమా ప్రేక్షకుడి మదిలో మెదులుతుంది. రొటీన్ కామెడీ తో నెట్టేద్దామనుకునే ప్రయత్నం కనిపించింది. ఇదంతా కలిసి ఓ ఫ్లాష్ బ్యాక్, క్లయిమాక్స్ కి లీడ్ చేస్తుంది. అక్కడా చెప్పుకోదగ్గ సీన్ లేదు. కొత్తదనం అనుకోకుండా ఓ హారర్ కామెడీ రొటీన్ గా చూసినట్టు నెక్స్ట్ నువ్వే అనిపిస్తుంది.
నటీనటులు…
హీరో ఆది నటనలో ఇంప్రూవ్ మెంట్ కనిపించింది. హీరోయిన్ బాగుంది. బాగా చేసింది. అయితే కామెడీ తో బ్రహ్మాజీ, రఘుబాబు కితకితలు పెట్టారు. రష్మీ తనదైన స్టైల్ లో రెచ్చగొట్టింది. షకీలా రోల్ చిన్నదే అయినా బాగుంది. స్క్రిప్ట్, డైలాగ్స్ మీద ఇంకా దృష్టి పెట్టాలి అనిపించినట్టే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో కూడా అనిపించింది. పాటలు ఓకే. ఇక ఎడిటింగ్, కెమెరా, ఆర్ట్ వర్క్ బాగుంది అనిపించింది. ప్రొడక్షన్ విలువలు సూపర్. దర్శకుడు ఇంకా హోమ్ వర్క్ చేస్తే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ …
బ్రహ్మాజీ
రఘుబాబు
రష్మీ
మైనస్ పాయింట్స్ …
రొటీన్ కామెడీ
స్క్రీన్ ప్లే .
తెలుగు బులెట్ పంచ్ లైన్ …”నెక్స్ట్ నువ్వే “ అన్నా కాదని తప్పుకుంటే మేలు.
తెలుగు బులెట్ రేటింగ్… 2.5 / 5 .