నైజీరియా వాణిజ్య రాజధాని లాగోస్‌లో నిర్మాణంలో ఉన్న 21 అంతస్తుల భవనం సోమవారం కుప్పకూలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. గురువారం కూలిన భవనశిథిలాల నుంచి మరో 14 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 36కు చేరింది. ఘటనాస్థలంతో వరుసగా నాలుగో రోజు కూడా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
తాజాగా గురువారం వెలికితీసిన మృతదేహాలతో కలుపుకొని మొత్తం మృతుల సంఖ్య 36కి చేరింది. మృతిచెందిన వారిలో 33 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.