ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటిని వణికిస్తున్న మహమ్మారి కరోనా. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ కొద్ది రోజులలోనే అన్ని దేశాలకు వ్యాపించింది. అయితే ఈ వైరస్‌కి మందు లేకపోవడంతో వేలాది మంది దీని బారిన పడి చనిపోతున్నారు. అయితే దీనికి మందు కనిపెట్టేందుకు అన్ని దేశాల శాస్త్రవేత్తలు తీవ్రంగా కష్టపడుతున్నారు. అయితే చైనా కావాలనే ఈ వైరస్‌ని పుట్టించి ప్రపంచవ్యాప్తంగా బయోవార్‌కి తెరలేపిందని చాలా మంది భావిస్తున్నారు.
అయితే ఇలాంటి తరుణంలో దీనిపై స్పందించిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఓ ఎవిడెన్స్ గురుంచి చెప్పడం అందరిని మరోసారి ఆలోచింప చేస్తుంది. చైనాలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ మొదటిసారి బయటపడిందని దీంతో అప్రమత్తమైన చైనా జనవరిలో వూహాన్ నగరం నుంచి ఇతర నగరాలకు డొమెస్టిక్ ఫ్లైట్స్‌తో పాటు ఇతర రవాణాలను నిలిపివేసిందని అన్నాడు. కానీ వుహన్ నగరం నుంచి ప్రపంచ దేశాలకు వెళ్ళే విమానాలకు మాత్రం అనుమతి ఇచ్చిందని ఇదంతా చూస్తుంటే ఉద్దేశ పూర్వకంగానే ఈ వైరస్‌ను ప్రపంచం మీదకి వదలకపోతే వుహన్ నుంచి అంతర్జాతీయ విమానాలను ఎందుకు నడిపిందని ప్రశ్నించాడు. ఇది వింటుంటే చైనాపై మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి.